calender_icon.png 10 November, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంప్రదాయ దుస్తులు తప్పనిసరి

19-05-2024 12:52:50 AM

యాదాద్రిలో ఆర్జిత సేవల్లో కొత్త రూల్

జూన్ 1 నుంచి అమల్లోకి

ఈవో ఏ భాస్కర్‌రావు

యాదాద్రి భువనగిరి, మే18(విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి చేస్తున్నట్టు దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కర్‌రావు ప్రకటించారు. ఈ నిబంధన జూన్ 1 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఆలయంలో శనివారం మాట్లా డుతూ.. స్వామివారి సుప్రభాతం, అర్చ నలు, అభిషేకం, హోమపూజలు, కల్యాణం, వెండిజోడి సేవతో పాటు ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనాల భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించివస్తేనే అనుమతిస్తామని తెలిపారు. సాధారణ క్యూలైన్లలో వచ్చే భక్తులకు మాత్రం మినహాయింపు ఉంటుంద న్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడటమే కాకుం డా, ఆలయ సంప్రదాయాలు పరిరక్షించడానికి ఈ నిబంధనను తీసుకువచ్చినట్టుగా పేర్కొన్నారు.