calender_icon.png 10 November, 2025 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను అరిగోస పెడుతున్న కాంగ్రెస్

19-05-2024 12:57:12 AM

కరీంనగర్, మే 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని అరిగోస పెడుతుందని, నేటికీ కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేవని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు అన్నారు. శనివారం కొత్తపల్లిలోని వరి ధాన్యం కల్లాలను బీజేపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న పంటను కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, కనీస వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. తడిసిన వడ్లను కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ వడ్ల కొనుగోలు మీద లేదని మండిపడ్డారు. పంటలకు బోనస్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కడార్ల రతన్ కుమార్, వేముల అనిల్, జిట్టవేణి రేణు, యువ ప్రశాంత్, అనిల్, మహేష్, ప్రతాప్, ఆనందాచారి పాల్గొన్నారు.