18-11-2025 12:00:00 AM
కామారెడ్డి, నవంబర్ 17 (విజయక్రాంతి): పేద ప్రజలకు సన్నబియ్యం అందించాలని సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలైన తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ప్రతి నెల ఉచితంగా రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తుంది. కామారెడ్డి జిల్లాలో 761 రేషన్ షాపులు, డీలర్లు ఉన్నారు. ప్రతి నెల లక్షల క్వింటాళ్ల రేషన్ బియ్యం రేషన్ షాపుల్లోకి చేరుతుంది. అర్హులైన పేద ప్రజలకు రేషన్ బియ్యం అందించడంలో రేషన్ డీలర్లు కక్కుర్తి పడుతున్నారు.
ప్రభుత్వ అధికారుల అండదండలు నెల నెల అధికారులకు ముట్ట చెపుతున్న మామూళ్లకు అలవాటు పడిన అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ రేషన్ అక్రమ బియ్యం చీకటి దందా వ్యాపా రానికి జిల్లాలో ప్రోత్సహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు మాత్రం ఫిర్యాదులు రావడం లేదంటున్నారు. ప్రతినెల లక్షల కింటల రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది.
దీనికి మూల కారణం పేద ప్రజలందరూ రేషన్ బియ్యాన్ని తీసుకోకపోవడంతో పాటు రేషన్ డీలర్లకి బియ్యాన్ని తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఇదే అదనంగా భావిస్తున్న రేషన్ డీలర్లు ప్రతినెల లక్షల కింటల్లా రేషన్ బియ్యం ఆక్రమ దందాను కొనసాగిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని రైస్ మిల్లర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మళ్లీ అదే బియ్యం రేషన్ డీలర్ల వద్ద నుంచి రైస్ మిల్లర్ వద్దకు చేరుకుంటున్నాయి.
ప్రతి నెల ఎక్కడో ఒకచోట నామ మాత్రం తనిఖీలు చేసి ఫిర్యాదులు వస్తేనే పౌరసరపరలా అధికారులు, రెవెన్యూ అధికారులు నామమాత్రం కేసులు చేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. ప్రతి నెల లక్షల టన్నుల రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న అధికారులు మాత్రం తమకేమీ తెలియడం లేదంటూ లోపాయి గారి ఒప్పందం రేషన్ డీలర్లు అధికారులతో చేసుకొని దర్జాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు.
ప్రతి నెల రేషన్ బియ్యం చీకటి దందా
కామారెడ్డి జిల్లాలో రేషన్ అక్రమ బియ్యం తరలింపు ప్రతినెల కొనసాగుతుంది. రేషన్ డీలర్ అధికారులతో కుమ్మకై రైస్ మిల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కొంతమంది పేద ప్రజలు రేషన్ బియ్యం తీసుకోకుండా రేషన్ డీలర్లకి తక్కువ ధర కు విక్రయిస్తున్నారు.
అధికారుల అండదండలు.
అక్రమ దందాను కొనసాగిస్తున్న రేషన్ డీలర్లు, ప్రభుత్వం ఎన్ని పగడ్బందీ చర్యలు తీసుకుంటున్న అధికారులు రేషన్ డీలర్లకు అనధికారికంగా ప్రోత్సహిస్తుండడంతో దర్జాగా అక్రమ రేషన్ బియ్యం దందాను రేషన్ డీలర్లు కొనసాగిస్తున్నారు. ప్రతి నెల అధికారులకు ముడుపులు ముట్టజెప్పి అక్రమ రేషన్ బియ్యం దందను చేపడుతున్నారని బహిరంగంగా చర్చలు కొనసాగుతున్న ఏదే జగ రేషన్ డీలర్లు ప్రతినెల అక్రమ oగ రేషన్ బియ్యంను రైస్ మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. పెద్ద ఎత్తున డీలర్లు సొమ్ము చేసుకుంటున్నారు. నెల నెల అధికారులకు మామూలు ముట్టజపుతుండడంతో అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.
12టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దుర్కి చౌరస్తా వద్ద సోమవారం తెల్లవారుజామున 12 టన్నుల రేషన్ బియ్యం డిసిఎంలో గాంధారి మండలం నుంచి కోటగిరికి రైస్ మిల్క్ తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారం రావడంతోనే పోలీసులు సాహసం చేశారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు పోలీస్ ఉన్నతాధికారి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట వేయాలని స్థానిక పోలీస్ అధికారులను ఆదేశించారు.
ఉమ్మడి జిల్లా రేషన్ బియ్యం కోటగిరిలోని రైస్ మిల్లుల కేనా...?
కామారెడ్డి, నిజాంబాద్ ఉమ్మడి జిల్లాలోని రేషన్ డీలర్లు, మరికొందరు వ్యాపారులు రేషన్ బియ్యాన్ని డీలర్ రా వద్ద లబ్ధిదారుల వద్ద కొనుగోలు చేసి డీసీఎంలు లారీలలో కోటగిరి లోని రైస్ మిల్లులకు తరలించి అమ్ముకుంటున్నారు. ఇటీవల పోలీసులు పలు దాడులు చేసినప్పుడు లక్షల క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడిన విషయం విధితమే.
అధికారుల అండ దండలే రేషన్ బియ్యం అక్రమ దందాకు ఊపిరి
కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని రేషన్ డీలర్ లు కొందరు అక్రమ రేషన్ బియ్యం దందాను కొనసాగిస్తున్నారు. మరికొందరు రైస్ మిల్లర్లు హైదరాబాద్ నుంచి రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. ఎన్ని కేసులు అయినా కూడా పట్టించుకోవడం లేదు. అధికారుల అండదండలు స్థానిక అధికారుల ప్రోత్సాహం ఉండడంతో ఏమి కాదని ఉద్దేశంతో రేషన్ అక్రమ బియ్యం దందాను కొనసాగిస్తున్నారు.
సోమవారం తెల్లవారుజామున పట్టుబడిన 12టన్నుల బియ్యం హైదరాబాదు నుంచి గాంధారి మీదుగా నసరుల్లాబాద్ వద్ద పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు కలిసి బియ్యా న్ని పట్టుకోవడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సంచలనం గా మారింది. లోకల్ లో రేషన్ అక్రమ బియ్యం దందా కొనసాగిస్తున్న వారే అధికారులకు పట్టిచ్చారనేది బహిరంగ రహస్యం. కోటగిరి రైస్ మిల్లులకు రేషన్ బియ్యాన్ని డిసిఎం లో 12 టన్నుల బియ్యం తరలిస్తుండగా పట్టుకున్నారు.
ఇప్పటికే కోటగిరి లోని మూడు రైస్ మిల్లుల లో రేషన్ బియ్యాన్ని ఏన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకొని సీజ్ చేశారు. ఈ బియ్యం కోటగిరి లోని రైస్ మిల్‌కు తరలిస్తున్నట్లు అధికారు లు తెలిపారు. లోతుగా విచారణ జరిపి ఆక్ర మ రేషన్ బియ్యం దంధాలు అరికట్టాలని ఉమ్మడి జిల్లా ప్రజలు కోరుతున్నారు.