కన్నుల పండువగా శ్రీ వేణుగోపాల స్వామికి పుష్ప యాగం
02-03-2026 07:22 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామికి పుష్పయాగం ఎంతో వైభవంగా, కన్నుల పండువగ నిర్వహించారు. రకరకాల పూలతో స్వామివారిని కొలిచారు. అంతకు ముందు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం చైర్మన్ పల్లామురళీధర్ సదా లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమం లో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ , మునిసిపల్ వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, పల్ల శరత్, అర్చకులు సౌమిత్రి శ్రావణ్ కుమార్, వేణుమాధవ్ ,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




