17 April, 2026 | 2:33 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

ప్రతి వ్యక్తికి హక్కులు కలిగి ఉంటాయి: ఎస్సై భార్గవ్ గౌడ్

02-03-2026 07:15 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని చిన్న ఆత్మకూరు గ్రామంలో స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్సై భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ... భారత రాజ్యంగం ద్వారా ప్రజలకు కల్పించబడిన ప్రాథమిక హక్కుల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

సమానత్వపు హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు, దోపిడిని వ్యతిరేకించే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, విద్య, సాంస్కృతిక హక్కులపై గ్రామస్తులకు ఎస్ఐ భార్గవ్ గౌడ్ వివరించారు. అనంతరం మాజీ జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రతి వ్యక్తికి సమాజంలో గౌరవంగా జీవించే హక్కు కలిగి ఉంటుందని ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అనిత లచ్చయ్య, ఏఈఓ దివ్య, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ వార్డెన్ రాములు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.