2 March, 2026 | 8:33 PM

రెగ్యులర్ డీడబ్ల్యూఓను నియమించాలి

02-03-2026 07:26 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో రెగ్యులర్ డి డబ్ల్యూ ఓ అధికారి లేకపోవడంతో జిల్లా దివ్యాంగులు ఇబ్బందులు కారణంగా రెగ్యులర్ అధికారులు నియమించాలని స్పందన దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఇసాక్ అలీ సోమవారం నిర్మల్ జిల్లాలోని సోషల్ మీడియా కార్యాలయంలో తమ ఆవేదన వెల్లుబుచ్చుకున్నారు.

కొత్త జిల్లాలతో అధికారులు ప్రజలకు దగ్గరవుతారని అనుకున్నమని, నిర్మల్ జిల్లాకు మాత్రం దివ్యాంగుల సంక్షేమాన్ని చూసే రెగ్యులర్ అధికారి లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నామన్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి రెగ్యులర్ డి డబ్ల్యూఓ అధికారిని నియమించాలని దివ్యాంగులు పేర్కొన్నారు. ఇందులో నిర్మల్ జిల్లా దివ్యాంగుల ప్రధాన కార్యదర్శి సాక్ పెళ్లి సురేందర్ ఉన్నారు.