17 April, 2026 | 10:29 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

యాసంగి ధాన్యం బకాయిలు చెల్లించాలి

22-04-2025 12:38 AM

కలెక్టర్ కుమార్ దీపక్ 

మంచిర్యాల, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : జిల్లాలో యాసంగి 2022 సంవత్సరానికి సంబంధించి వరిధాన్యం బకాయి ఉన్న రైస్ మిల్లర్లు బకాయిలను వెంటనే పూర్తిగా చెల్లించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం తన చాంబర్‌లో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ తో కలిసి జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, రైస్ మిల్లర్లతో బకాయి చెల్లింపులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో యాసంగి 2022 సంవత్సరానికిగాను రైస్ మిల్లులకు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా ఆక్షన్ వరిధాన్యం బకాయి ఉన్న దాదాపు 87 కోట్ల రూపాయలను రైస్ మిల్లర్లు వెంటనే చెల్లించాలని, 1 కోటి రూపాయలలోపు ఉన్న వారు తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆక్షన్ వరిధాన్యం బకాయి పూర్తి చేసి యాసంగి 2024- సంబంధించి వరిధాన్యం దిగుమతి చేసుకోవడానికి సంసిద్ధం గా ఉండాలని, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ పౌరసరఫరాల అధికారి, అసిస్టెంట్ గ్రేడ్-1 అధికారి, జిల్లా రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.