23 June, 2026 | 10:25 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

యాతాకుల మధుబాబు జన్మదిన వేడుకలు

18-11-2025 06:39 PM

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి..

కోదాడ: సూర్యాపేట జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ యూనియన్ అధ్యక్షులు యాతాకుల మధుబాబు జన్మదిన వేడుకలు కోదాడ ఎమ్మెల్యే నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి స్వయంగా కేక్ కట్ చేసి మధు బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాతాకుల మధుబాబు, అంచెలంచెలుగా ఎదుగుతూ సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ యూనియన్‌కు నాయకత్వం వహిస్తూ, సహ ఉద్యోగులు, ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావు తదితర ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.