9 April, 2026 | 3:45 AM

విద్యార్థులు గొప్ప ఆవిష్కర్తలుగా ఎదగాలి

09-04-2026 01:37 AM
  1. విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు
  2. ఘనంగా ‘ట్రినెక్సియా 2026’ టెక్ ఫెస్ట్ నిర్వహణ

హైదరాబాద్, ఏప్రిల్ 8(విజయక్రాంతి):  సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటూ, విద్యార్థులు ప్రపంచం గర్వించే గొప్ప ఆవిష్కర్తలుగా ఎదగాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు ఆకాంక్షించారు. యాదా ద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలం, దేశ్‌ముఖిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీలో బుధవారం ‘ట్రినెక్సియా - 2026’ పేరుతో టెక్ ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డైరె క్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు మాట్లాడుతూ నేటి యువత కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా, కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేయాలని సూచించారు. మీ ఆలోచనలు సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు చూపేలా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నతమైన లక్ష్యాలను కలిగి ఉండాలని, గొప్ప కలలు కనాలని, ఆ కలలను నిజం చేసుకునే వరకు శ్రమించాలని పేర్కొన్నారు. ఇక ‘ట్రినెక్సియా - 2026’ టెక్ ఫెస్ట్ విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టింది.

విద్యార్థుల భాగస్వామ్యంతో యూ నివర్సిటీ ప్రాంగణం ఒక సరికొత్త టెక్నాలజీ హబ్‌ను తలపించింది. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీయడానికి ఇలాంటి వేది కలు ఎంతో అవసరమని అధ్యాపకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఇవి విద్యార్థుల భవిష్యత్తుకు, కెరీర్‌కు ఎంతో దోహదప డతా యన్నారు.

ఈ టెక్ ఫెస్ట్‌ల్లో ప్రధానంగా ఐడియాథాన్, ఈ-స్పోర్ట్స్, టెక్ పల్స్, డీబగ్గింగ్ ఛాలెంజ్, బ్లిట్జ్ అనే ఐదు అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రతి భ చాటిన విజేతలకు మొత్తం రూ. 25,000కు పైగా నగదు బహుమతులతో పాటు మెమెంటోలు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆయా విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.