3 July, 2026 | 9:30 PM

Breaking News

మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •  

శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

17-06-2025 05:56 PM

ఎల్లారెడ్డి (విజయక్రాంతి): కేరళ రాష్ట్రంలోని శబరిమలలో బంగారు కోవెలలో కొలువై వున్నా కలయుగ దైవం ధర్మశాస్త శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామిని మంగళవారం తెల్లవారుజామున కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే. మదన్ మోహన్ రావు(MLA K. Madan Mohan Rao) తన తనయుడు కార్తీక్ రావుతో కలిసి, దాదాపు 7 కిలోమీటర్ల చిన్నపాదం కొండకు కాలినడకతో వెళ్లి దర్శించుకున్నారు. కేరళ ట్రావెన్ కోర్ సంస్థానం అధికారులు ప్రోటోకాల్ ప్రకారం దర్శనం కల్పించారు.

సోమవారం రాత్రి శబరిమల కొండకు కాలి నడకన చేరుకున్న ఎమ్మెల్యే, రాత్రి స్వామిని ఒకసారి దర్శించుకొని, మళ్ళీ మంగళవారం ఉదయం సుప్రభాత సేవలో ఎమ్మెల్యే అయ్యప్పను దర్శించుకున్నారు. అక్కడి నుండి మళ్ళీ కాలినడకనే కొండా దిగి అయ్యప్ప స్వామి పెరిగిన ప్రాంతం అయినా పండాలని రాజ్యానికి వెళ్లి అక్కడి నుండి హైదరాబాద్  తిరుగు ప్రయాణం అయినట్లు ఎమ్మెల్యే మదన్మోహన్రావు విజయక్రాంతి ప్రతినిధితో తెలిపారు.