24 August, 2026 | 11:36 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ మంత్రిని కలిసిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

17-06-2025 05:53 PM

సన్మానించిన కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్ పర్సన్..

కామారెడ్డి (విజయక్రాంతి): ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, (గ్రామీణ నీటి సరఫరాతో సహా, స్త్రీ శిశు సంక్షేమం, మంత్రివర్యులు సీతక్కను మంగళవారం కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ(Former Municipal Chairman Gaddam Indupriya), ఇటీవల టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లతో కలిసి మంత్రిని సన్మానించారు. మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం కామారెడ్డి సమస్యలను మంత్రికి విన్నవించినట్లు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మర్యాదపూర్వకంగా కలిసినట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తెలిపారు.

ఈ సందర్బంగా సీతక్కకు పుష్పగుచ్చం అందించారు. తనకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కోరినట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో పార్టీ పరిస్థితిని సీతక్క అడిగి తెల్సుకున్నారని తెలిపారు. కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరగా, మంత్రివర్యులు సీతక్క, సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో, మాజీ మున్సిపల్ చైర్మన్, గడ్డం ఇందుప్రియ, మాజీ కౌన్సిలర్లు, జూలూరి సుధాకర్, పంపరి లతా శ్రీనివాస్, పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ కృష్ణ, పిడుగు మమతా సాయిబాబా, సలీం,  తదితరులు పాల్గొన్నారు.