calender_icon.png 20 June, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శ గ్రామం ఎల్లంపల్లి !

20-06-2025 12:51:04 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

మెదక్, జూన్ 19(విజయక్రాంతి)! క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించడంతో పాటు గ్రామంలోని ఇంటింటికి తిరిగి బడి ఈడు పిల్లలు ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించి పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరిన విధానం బడిబాట స్ఫూర్తిదాయకంగా చెప్పారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను పరిశీలించగా ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్య అందిస్తున్నారని,ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్ విద్యా బోధన జరుగుతుందని, చదవడం రాయడం, గణిత విద్యా బోధనలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటు న్నామన్నా రు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, సంబంధిత ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులుపాల్గొన్నారు.