calender_icon.png 15 August, 2025 | 2:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మొన్న జూరాల, నిన్న మంజీరా, నేడు సింగూరు

15-08-2025 01:18:32 AM

  1. డ్యామ్‌లకు మోగిన డేంజర్ బెల్స్

యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాల్సిందే

మూసీ నదిపై బ్రిడ్జీల నిర్మాణంలోనూ నిర్లక్ష్యంగా కాంగ్రెస్

మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): మొన్న జూరాల ప్రాజెక్టుకు ప్రమాద ఘంటికలు..నిన్న మంజీరా బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు..నేడు సింగూరు డ్యామ్‌కు డేంజర్ బెల్స్ మోగాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా ఆయన ప్రాజెక్టుల స్వరూపాలపై స్పందించారు. ఇతర ప్రాజెక్టులకు రిపేర్లు వస్తే తప్పులేదనట్టు ఫోజులు కొట్టే కాంగ్రెస్, బీజేపీ నేతలు..

కాళేశ్వరంపై మాత్రం బురదజల్లడం.. వాళ్ల దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రాజెక్టులు కట్టాక రిపేర్లు వస్తుంటాయనే విషయాన్ని మభ్యపెట్టి కేవలం మేడిగడ్డ బ్యారేజీలోని రెండు పిల్లర్లను బూచిగా చూపించి కమిషన్ల పేరిట కక్షగట్టడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడంతోపాటు బలహీనంగా ఉన్న ఇతర గేట్ల రోప్‌లను అలాగే గాలికొదిలేస్తే ప్రాజెక్టు నిలుస్తుందా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్ జంటనగరాలకు మంచినీరు అందించే మం జీరా బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉందని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ నిపుణుల బృందం చేసిన హెచ్చరికపై సోయిలేకపోతే మంజీరాకు మనుగడ ఉంటుందా? అని నిలదీశారు. ఇవాళ సింగూరు డ్యామ్‌కు కూడా డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అదే ఎన్‌డీఎస్‌ఏ హెచ్చరికను పెడచెవిన పెట్టి ప్రాజెక్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తారా? అని అన్నారు. 

బ్రిడ్జీల నిర్మాణంలో నిర్లక్ష్యం

మూసీ నదిపై బ్రిడ్జీల నిర్మాణంలో కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శిస్తుందని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఎండగట్టారు. మూసీ నదిపై వంతెనల నిర్మాణం హైదరాబాద్ వాసుల చిరకాల కలన్నారు. ఆ కల ను నిజం చేయడానికి, బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రూ.545 కోట్లు మం జూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించిందని వెల్లడించారు.

మూసీ నదిపై వంతెనల ని ర్మాణం ద్వారా హైదరాబాద్ వాసు ల రాకపోకలను సులభతరం చేయడానికి, బీఆర్‌ఎస్ ప్రభుత్వం జన వరి 2022లో రూ. 545 కోట్లతో 15 వంతెనల నిర్మాణానికి మంజూ రు చేసిందని తెలిపారు. ఈ వంతెనల పొడవు సుమారు 150- మీటర్లని పేర్కొన్నారు. కానీ కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని, మూసీ నదిపై ఒక్క వంతెన కూడా ఇంకా పూర్తి కాలేదన్నారు.