15-08-2025 01:19:14 AM
అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశం
హైదరాబాద్,సిటీబ్యూరో ఆగస్టు 14 (విజయ క్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో, జీహెఎంసీ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమ త్తమైంది. రానున్న మూడు రోజులు అత్యం త కీలకమని, నగర జనజీవనానికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని జీహెఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. ఆయన గురువారం ఉదయం రాజేంద్రనగర్ సర్కిల్‌లో పర్యటించారు.
ప్రమాదానికి ఆస్కారం ఉన్న ప్రాంతాలపై నిరంతర నిఘా ఉంచాలని, విపత్తు స్పందన బృందాలు పూర్తి సన్నద్ధతతో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. వరద ముంపునకు తరచూ గురయ్యే జల్‌పల్లి చెరువు పరిసర ప్రాంతాలను, ఇతర లోతట్టు ప్రాంతాలను ఆయన పరిశీలించారు.
వర్షాకాలంలో ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలను, ఫీల్డ్ బృందాల సన్నద్ధతను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రాఫిక్, విపత్తు స్పందన డీఆర్‌ఎఫ్ బృందాలు పూర్తి సమన్వయంతో పనిచేయడం అత్యంత కీలకమన్నారు.