calender_icon.png 15 August, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

15-08-2025 01:18:16 AM

చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్‌రెడ్డి

మలక్‌పేట, ఆగస్టు 14  (విజయ క్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌యంసి చార్మినార్ జోన్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి  గురువారం మలక్‌పేట్ సర్కి ల్ పరిధిలోని వర్ష ప్రభావిత ప్రాంతా ల్లో పర్యటించారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న  భారీ వర్షాలకు జలమయమైన మలక్ పేట్ సర్కిల్ పరిధిలోని నల్గొండ క్రాస్ రోడ్, ముసారాంబాగ్ ఇతర ప్రాంతాల్లో సర్కిల్ డిప్యూటీ కమిషనర్  ఇన్ కేశఫ్  అలీ,  ప్రాజెకట్స్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కలిసి పర్యటించి  వరద నీటి సమస్యలపై ఆరా తీశారు.