17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సంపూర్ణ ఆరోగ్యానికి యోగ దోహదపడుతుంది

16-06-2025 10:57 AM

ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు 

ఎల్లారెడ్డి, (విజయక్రాంతి): సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు(Yellareddy DSP Srinivasa Rao) అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి  పట్టణంలోని  వైశ్య భవన్ లో యోగ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా యజ్ఞసహిత యోగా సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి డీఎస్పీ, శ్రీనివాస్ రావ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగ గురువు,నాగరాజు గౌడ్ మాట్లాడుతూ ఆసనాలు వస్తే మానసిక ప్రశాంతత లభి స్తుందని తెలిపారు. 75 కోట్ల సూర్య నమస్కారాల్లో భాగంగా రాష్ట్రంలో,కామారెడ్డి జిల్లా మొదటిస్థానంలో నిలిచిందని అన్నారు.

యోగ సాధన అంటే యోగా అభ్యాసం ద్వారా ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి చెందడం. ఇది ఒక వ్యక్తి తన అంతర్గత ప్రపంచాన్ని అన్వేషించడానికి, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, సామరస్యాన్ని సాధించడానికి చేసే ఒక ప్రక్రియ, అని, సాధారణంగా యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ఇతర యోగ పద్ధతుల ద్వారా ఇది సాధించబడుతుందన్నారు.భౌతిక శరీరానికి సంబంధించిన భంగిమలు, ఇవి శరీరానికి బలం, ఆవశ్య కత,  సమతుల్యతను చేకూరుస్తాయి,అని యోగా గురువు నాగరాజ్ గౌడ్ తెలిపారు. 365 రోజులుగాక్రమం తప్పకుండా యజ్ఞ సైతం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో యోగాసన సభ్యులు,పలువురు పాల్గొన్నారు.