17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

మోడల్ స్కూల్ లో ఘనంగా యోగా డే

21-06-2025 04:57 PM

చేవెళ్ల: చేవెళ్ల మున్సిపాలిటీలోని మోడల్ స్కూల్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం స్కూల్  గ్రౌండ్ లో ప్రముఖ ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ రమ, పీడీ ఆంజనేయులు ఆధ్వర్యంలో విద్యార్థులు యోగాసనాలు వేశారు. అనంతరం ప్రిన్సిపాల్ చిన్నప రెడ్డి మాట్లాడుతూ.. యోగా, ధ్యానంతో  ఏకాగ్రత పెరుగుతుందన్నారు. డిప్రెషన్, ఆందోళన, అలసట లాంటి సమస్యలు తగ్గడంతో పాటు మానసికంగా దృఢంగా తయారవుతామన్నారు.

తద్వారా చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించే అవకాశం ఉందన్నారు. పీడీ ఆంజనేయులు మాట్లాడుతూ.. ప్రతి రోజు కనీసం 30 నిమిషాలు యోగాకు కేటాయిస్తే... ఎలాంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవన్నారు. యోగాకు వయస్సు అడ్డంకి కాదని, ఏ వయస్సు వారైనా యోగా చేయవచ్చని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివ కుమార్, జగదీష్ , విద్యార్థులు  పాల్గొన్నారు.