21-06-2025 08:35:55 PM
యోగ గురువు గురూజీ ప్రతాప్ మహారాజ్, కిడ్స్ విద్యాసంస్థ చైర్మన్ నీలా సత్యనారాయణ...
కోదాడ: కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ(International Yoga Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ యోగ గురువు గురూజీ ప్రతాప్ మహారాజ్ పాల్గొని యోగ ఆవశ్యకతను విద్యార్థులకు విద్యార్థినులకు, విపులంగా వివరించారు.
ప్రతాప్ మహారాజ్ యోగ ఆవశ్యకతను వివరిస్తూ యోగ అంటే జీవితాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకోవడం అని, ప్రాచీన భారతీయ విజ్ఞానం మానవాళికి అందించిన అపురూప నగ యోగ అని, దేహాన్ని దేవాలయంగా, జీవుణ్ణి దేవుడిగా, జీవనాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, అలహాదంగా మలచుకోవడానికి మార్గాన్ని చూపించేది యోగ అని, మానవాళికి అందుబాటులో ఉన్న అతి పెద్ద భాగ్యం యోగ అని, యోగ సంతోషాన్ని, సౌఖ్యాన్ని కూడా ఏక కాలంలో అందిస్తుందని, యోగ ఆసనాలు ఒత్తిడి దూరం చేస్తాయని, యోగ నిరంతర ప్ర క్రియ అని, యోగాసనాల ద్వారా విద్యార్థులను ఉత్తేజపరిచారు. కిట్స్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ మాట్లాడుతూ, విద్యార్థినులు యోగను దినచర్యగా పాటించాలని, యోగ తోనే సంపూర్ణ ఆరోగ్య వంతులు గా ఉంటారని అన్నారు.
యోగ కార్యక్రమంలో ప్రముఖ బ్రీతింగ్ కోచ్ నిపుణులు గెల్లా. బద్రీనాధ్ పాల్గొని, విద్యార్థినులకు బ్రీతింగ్ మెలుకువలు నేర్పించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, డైరెక్టర్ డాక్టర్ నాగార్జున రావు, ప్రోగ్రాం కన్వీనర్.... ఇరుకుళ్ళ చెన్నకేశవరావు, స్వర్ణ భారతి ట్రస్ట్ ఫౌండర్ గాదంశెట్టి శ్రీనివాస్, రాజశేఖర్, విద్యార్థి నులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.