11-05-2025 12:00:00 AM
నడవటం, పరిగెత్తటం లాంటివి రోజూ చేయడం మంచిదే. వ్యాయామాలు చేస్తే శారీరక ఆరోగ్యం కలుగుతుంది. అయితే యోగా చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.
* యోగాసనాలు వేయడం వల్ల శరీరం స్ట్రెచ్ అయినట్లు అనిపిస్తుంది. ప్రతిరోజూ యోగాసనాలు వేయడం అలవాటు చేసుకుంటే శరీరంలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. తద్వారా గుండెకు మంచిది.
* శరీరం యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా చురుగ్గా ఉంటారు. ముఖ్యంగా ఫేస్‌లో కాంతి కనిపిస్తుంది.
* శరీరానికి మంచి ఫిట్ నెస్‌ను ఇస్తుంది యోగా. శరీరం బ్యాలన్స్ అవ్వడం వల్ల కండరాలు మరింతగా గట్టిపడతాయి.
* యోగాసనాలు వేయడం వల్ల ఏకాగ్రత కలుగుతుంది. తలనొప్పులు, వెన్నెముక లాంటి సమస్యలు తగ్గిపోతాయి. నిద్రలేమి లాంటి సమస్యలతో బాధపడేవాళ్లకు యోగా అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. సాఫీగా నిద్ర పడుతుంది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది.
* డిప్రెషన్ మూడ్ పోతుంది. మెంటల్‌గా స్ట్రాంగ్ కావడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
* యోగా చేసేవారి వయసు కూడా కనపడదు. యంగ్ లుక్‌లో ఉంటారు. దీనివల్ల మరింత ఆనందం కలుగుతుంది. జీవనకాలం పెరుగుతుంది.
* యోగాసనాలు వేయడం వల్ల ఎముకల్లో గట్టిదనం వస్తుంది. జీవక్రియ సాఫీగా జరుగుతుంది. ముఖ్యంగా మహిళ శారీరక, మానసిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. వ్యాధినిరోధక శక్తి కూడా పెరుగుతుంది.