08-05-2025 12:36:45 AM
6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గింపు
న్యూఢిల్లీ, మే 7: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) 2025 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును తగ్గించింది. మొదట్లో 6.7 శాతంగా ఉన్న వృద్ధి రేటు కాస్త 6.4 శాతానికి తగ్గింది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన వాణిజ్య అనిశ్చితుల కారణంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా సుంకాలు మొదలైన కారణం వల్ల ఈ తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ఓవరాల్ వృద్ధి రేటును తగ్గించినా కానీ దేశీయంగా వ్యవసాయం, తయారీ రంగం వంటి అంశాలు వృద్ధికి మద్ధతునిస్తున్నాయని పేర్కొంది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్‌బీఐ తన మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి 6 శాతానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అభివృద్ధి చెందిన చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఈ సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. 2021 నుంచి 2024 ఆర్థిక సంవత్సరం వరకు దేశంలో సగటు వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది.
పోయిన దశాబ్దం (2010 మధ్య కాలంలో వృద్ధి రేటు 6.6 శాతంగా ఉండేది. ప్రపంచబ్యాంకు కూడా భారత వృద్ధి రేటును 6.3 శాతానికి తగ్గించింది. 6.7 శాతంగా ఉన్న వృద్ధి రేటును 6.3 శాతంగా నమోదవుతుందని అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.