calender_icon.png 22 June, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోగ్య సంరక్షణలో యోగా ఎంతో అవసరం

21-06-2025 10:11:45 PM

ఈ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్

పినపాక (విజయక్రాంతి): ఆరోగ్య సంరక్షణలో యోగా ప్రాముఖ్యత ఎంతగానో ఉందని ఈ బయ్యారం ఎస్సై రాజ్ కుమార్(SI Raj Kumar) అన్నారు. శనివారం యోగా దినోత్సవం పురస్కరించుకొని పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల శ్రీవిద్య జూనియర్ కళాశాలలో యోగా డే ప్రాముఖ్యతను ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఆయన అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగా సాధన చేయాలని సూచించారు. సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలంటే ప్రతిరోజూ యోగా సాధాన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవిద్య కరస్పాండెంట్ నిరోషా, ప్రిన్సిపల్ రవి ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.