17 April, 2026 | 3:28 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఆనందకర జీవితానికి యోగా ముఖ్యమైనది

21-06-2025 06:21 PM

డిసిపి భాస్కర్...

మంచిర్యాల (విజయక్రాంతి): ఆనందకర జీవితంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుందని డిసిపి ఎగ్గడి భాస్కర్(DCP Eggadi Bhaskar) అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) పురస్కరించుకొని కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, ఎసిపి ప్రకాష్ లతో కలిసి హాజరై వ్యాయామం, యోగా చేశారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ... యోగా ద్వారా మానసిక పరిపూర్ణత, శారీరక ఆరోగ్యం కలుగుతుందని, మానవ జీవితంలో ప్రతిరోజు యోగా, వ్యాయామానికి కొంత సమయం కేటాయించుకోవాలని తెలిపారు.

యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప వరమని, ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న ప్రస్తుత యువత వారి దినచర్యలలో యోగాను భాగం చేసుకోవాలని తెలిపారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మానసికంగా, శారీరకంగా సమతుల్యం సాధిస్తారని, ఎన్నో సమస్యలకు యోగ పరిష్కారం చూపుతోందని తెలిపారు. యోగాకు ఎలాంటి వివక్షత ఉండదని, ప్రతి ఒక్కరు యోగా చేయాలని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటంలో మనిషి మానసిక స్థితిని మెరుగుపరుచుకుని దృఢంగా ఉండేందుకు యోగా దోహదపడుతుందని తెలిపారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శరీరంలో, జీవనశైలిలో మార్పులు సంభవిస్తాయని, అసంక్రమణ వ్యాధుల నుండి కాపాడుకోవడంలో రోగ నిరోధక శక్తి పెంపొందుతుందని తెలిపారు.

ప్రతి దినం యోగా చేయడం పిల్లలకు అలవాటు చేయాలని, జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలలో కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లా అధికారులు, వైద్యాధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది, పిల్లలు, ఆయుష్ కార్యక్రమం ఇన్చార్జులు యోగాసనాలు సాధన చేశారు. అనంతరం యోగాలో శిక్షణ పొందిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, జిల్లా పౌర సంబంధాల అధికారి యం.కృష్ణమూర్తి, వైద్యాధికారులు డాక్టర్ పద్మజ, డాక్టర్ నీరజ, ఆయుష్ వైద్యులు రవికుమార్, డాక్టర్ ప్రసాద్, డాక్టర్ అనిత, మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.