17 April, 2026 | 1:49 PM

Breaking News

ఉపాధి హామీ పని స్థలాల్లో యోగా వేడుకలు

21-06-2025 06:18 PM

మందమర్రి (విజయక్రాంతి): అంతర్జాతీయ యోగా దినోత్సవ(International Yoga Day) వేడుకలు మండలంలోని పొన్నారం గ్రామ పంచాయతీలో ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ పరిధిలోని ఉపాధి హామీ పని స్థలాల్లో శనివారం యోగా వేడుకలు ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ప్రారంభించి మాట్లాడారు. మానవులు తమ దైనందిన జీవితంలో ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరు యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. అనంతరం కూలీలకు యోగాసనాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, బొజ్జ నాగయ్య, నల్లెల్లి సత్తయ్య, దొంతమాల వెంకటరాజు, బేర సుజాత, బొజ్జ రాజమణి, నల్లెల్లి లక్ష్మి, బేర దీప, కుంటాల మల్లయ్య, వినోదలు పాల్గొన్నారు.