24 August, 2026 | 10:29 PM

Breaking News

అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •  

యోగాతో ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం

21-06-2025 04:26 PM

ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్..

ములుగు (విజయక్రాంతి): ప్రతి ఒక్కరూ యోగ చేయడం వలన వారి ఆయుషు పెరగడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యకరంగా ఉంటారని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్(District Collector Divakara TS) అన్నారు. శనివారం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని  డిబ్ల్యూసిడి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో  నిర్వహించిన యోగ కార్యక్రమంలో అదనం కలెక్టర్ మహేందర్ జి ములుగు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి గోపాల్ రావుతో కలిసి జ్యోతి ప్రజ్వల చేసి కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మానసిక,శారీరక,ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు యోగా చేయాలని సూచించారు. యువతీ యువకులు వ్యసనాలకు బానిస కాకుండా మంచి ఆరోగ్యం కోసం యోగా చేయాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం వేళలా కొంత సమయాన్ని కేటాయిస్తూ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, యోగ చేయడం వలన పలు రకాల వ్యాధులు దరి చేరకుండానే ఆరోగ్యకరంగా ఉంటారని అన్నారు. అనంతరం యోగ ఆసనాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు.