21-06-2025 04:33:00 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో వాసవి క్లబ్, వనిత క్లబ్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం(International Yoga Day) ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం వాసవి మాత దేవాలయంలో ఈ రెండు క్లబ్‌ల ఆధ్వర్యంలో యోగ దినోత్సవం తెలిపారు. ఈ సందర్భంగా బాదనకుర్తి గ్రామానికి చెందిన యోగా మాస్టర్ నువ్వుల రాజేందర్ ను సత్కరించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... యోగా అనేది శారీరక ,మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు కోసం రూపొందించబడినదని, ఇది ఒక పురాతన అభ్యాసం, శ్వాస నియంత్రణ ,ధ్యానం, ప్రత్యేక ఆసనములు వివిధ సాంకేతికలను కలిగి ఉంటుందని ఆరోగ్యానికి చాలా అవసరం అని వివరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రెసిడెంట్ చిటికేసి రవీందర్, సెక్రటరీ సతీష్ కుమార్, కోశాధికారి కూరగాయల సతీష్ కుమార్, వనిత క్లబ్ ప్రెసిడెంట్ స్వరూప రాణి ,సెక్రటరీ నీలి శ్రీలత, కోశాధికారి మార రామ, మహిళా సంఘం అధ్యక్షురాలు గోలి పద్మజ, బుస జ్యోతి ,సంధ్య, తదితరులు ఉన్నారు.