యోగా దినచర్యల్లో భాగం కావాలి
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట,(విజయక్రాంతి): మనిషి అనేక రకాల వత్తిళ్ళ వల్ల పలు రకాల ఆరోగ్య సంబంధమైన సమస్యలను(Health-related problems) ఎదుర్కొనవలసి వస్తుందని వాటిని అధిగమించడానికి ప్రతి ఒక్కరు యోగాను తప్పక దినచర్యల్లో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్(Collector Tejas Nandalal Pawar) అన్నారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం(International Yoga Day) సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన యోగ శిక్షణ కార్యక్రమంలో పలువురు అధికారులతో కలిసి యోగాదానాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యాంత్రిక జీవితంలో అనేక శారీరక మానసిక సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుందని వాటిని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి యోగా ఒక మంచి మార్గం అన్నారు. నేటి రోజుల్లో యువత పెడదోవ పట్టకుండా ఉండాలంటే యోగ సాధన చేయాలన్నారు. యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, యోగా శిక్షకులు తదితరులు పాల్గొన్నారు.






