18 April, 2026 | 11:48 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం

21-06-2025 09:50 AM

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

అదుపులోకి తీసుకున్న వరంగల్ సుబేదారి పోలీసులు 

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Huzurabad BRS MLA Padi Kaushik Reddy) అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(MLA Thanneeru Harish Rao) అన్నారు. పాలన గాలికి వదిలేసి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని ఆరోపించారు. రైతుల నుండి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతుందని మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం(Indiramma Rajyam) అని చెప్పుకునే రేవంత్, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. కేసులు, అరెస్టులతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పాలన వైఫల్యాలను నిలదీస్తాం, నమ్మించి నయవంచన చేసిన మీ మోస పూరిత వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడుతం అన్నారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని(Padi Kaushik Reddy) వెంటనే బేషరతుగా విడుదల చేయాలి భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో వరంగల్ సుబెదారి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అక్రమ మైనింగ్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి సీతక్క తన మీద అక్రమ కేసులుబనాయిస్తున్నారని అయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కేసులకు భయపడే వాడిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టిన ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు.