8 July, 2026 | 2:02 AM

అన్నం పెట్టినోడికి సున్నం పెడతావ్..

08-07-2026 12:00 AM
  1. మల్లికార్జున్‌పై భానుక జ్యోతి స్వరూప్ ఘాటు విమర్శ
  2. మల్లికార్జున్ గతాన్ని మరిచిన రామకృష్ణపై విమర్శలా..?
  3. నీపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్

సికింద్రాబాద్, జూలై 7 (విజయక్రాంతి): కంటోన్మెంట్ బీజేపీలో వర్గ పోరు సాగుతోంది. ఇద్దరు బీజేపీ నేతలు మధ్య నెలకొన్న విభేదాలు తాజాగా స్థానిక బీజేపీ లో చిక్కుముడిలామారాయి. ఇప్పటికే పార్టీ ప్రాథమిక సభ్యత్వం కోల్పోయిన బోర్డ్ మాజీ నామినేట్ సభ్యుడు జె.రామకృష్ణ పై మల్లికార్జున్ చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గం లో పెనుదు మారంగా చేస్తున్నాయి అన్ని తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా మల్లికార్జున్ టార్గెట్ చేసిన బానుక జ్యోతి స్వరూప్ చేసిన వ్యాఖ్యలతో పార్టీ లో చర్చ కు దారిటీసినట్లు తెలుస్తుంది. రామకృష్ణ పై మాట్లాడటం మానేసి,మొదట నీపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలంటూ మల్లికార్జున్కు భానుక జ్యోతి స్వరూప్ ఘాటుగా సవాల్ విసిరారు. నీ పోస్ట్ ఊడిపోవడం ఖాయమని, నువ్వు నమ్మిన వాళ్లే నిన్ను ముంచేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

గతంలో సిబిఐ కేసులో ఎవరు జైలుకు వెళ్లారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఈ వ్యవహారంలో అసలు నిజాలను ప్రజల ముందు పెట్టాలని స్పష్టం చేశారు. మల్లికార్జున్ వైఖరిని తప్పుబడుతూ జ్యోతి స్వరూప్ చేసిన ఈ సంచలన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.