calender_icon.png 20 July, 2025 | 3:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధార్ వెంట పెట్టుకు రావాల్సిందే

13-07-2024 12:02:41 AM

ఎంపీ కంగనారనౌత్

న్యూఢిల్లీ, జూలై 12: ఎంపీగా ఎన్నికైన బాలీవుడ్ నటి కంగనారనౌత్ తన వద్దకు వచ్చే వారికి షరతు పెట్టింది. తనతో సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలు ఆధార్ కార్డు తీసుకురావాలని, అంతే కాకుండా ఏ సమస్య గురించి వచ్చారో ఓ పేపర్ మీద రాసి ఇవ్వాలని నిబంధన పెట్టింది. ఇలా చేయడం వల్ల వారికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగదు అని కంగనా మీడియాతో తెలిపింది. ఈ విషయంపై కాంగ్రెస్ మండిపడింది. కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ మాట్లాడుతూ.. చట్టసభలకు ఎన్నికైన ప్రతినిధులు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే వారి ఐడెంటిటీ అడగడమేంటని ప్రశ్నించారు. సమస్యలు చెప్పిరావని కంగనాకు చురలకంటించారు.