కుటుంబం కోసం సమయాన్ని కేటాయించాలి
- ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఘన సన్మానం
- రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
రామగుండం, ఆగస్టు 31 (విజయ క్రాంతి): తమ కుటుంబ క్షేమం కంటే సమాజ క్షేమానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంత రం విధులు నిర్వహించేది పోలీసులేనని రా మగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఉద్యోగ విరమణ పొందుతు న్న పోలీస్ అధికారులు ఇకపై తమ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలని సూచిం చారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్లో సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వహించి సో మవారం ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఘనంగా సన్మానించారు. పోలీ స్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌ఐ ఎం. రవీందర్, ఏఎస్‌ఐలు బసవ దీపక్, దుంపల కొముర య్య, హెడ్ కానిస్టేబుల్ చిలుముల మధునయ్యలను పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక లను అందజేశారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగం అనేది కేవలం విధి మాత్రమే కాదని, సమాజంలోని ప్రజల భద్రత, శాంతిభద్రతల పరి రక్షణకు అంకితమైన సేవ అని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు, సవాళ్లను ఎదుర్కొంటూ పోలీసులు ప్రజలకు సేవలందిస్తారని అన్నారు.
ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు
కొన్ని సందర్భాల్లో శాంతిభద్రతల పరిరక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్కచే యకుండా పోలీసులు విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. ఉద్యోగ జీవితంలో ఎదురైన అనుభవాలు, వారు అందించిన సేవలు రాబో యే తరం పోలీసు అధికారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని కొనియాడారు.
ఉద్యోగ విరమణ అనేది ఒక విధి బాధ్యతకు ముగింపు మాత్రమేనని, జీవితానికి కాదని అన్నారు. ఇకపై కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతూ, తమ ఆరోగ్యాన్ని కాపా డుకోవాలని సూచించారు. నిత్యం యోగా లేదా వ్యాయామం చేస్తూ ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని తెలిపారు.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి
పోలీస్ విధుల్లో ఉన్న సమయంలో కు టుంబానికి కేటాయించే సమయం పరిమితంగా ఉంటుందని, ఉద్యోగ విరమణ అనం తరం కుటుంబ సభ్యుల కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలని కమిషనర్ సూచిం చారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సుఖసంతోషాలతో, ఆనందంగా జీవి తాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, ఏఓ శ్రీనివాస్, ఆర్‌ఐ రమేష్, సీసీ సందీప్, ఉద్యోగ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






