ట్రాక్టర్ బావిలోపడి యువ రైతు మృతి
భూపాలపల్లి జిల్లాలో విషాదం
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 9 (విజయక్రాంతి): దుక్కి దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బావిలో పడ్డ ఘటనలో యువరైతు దుర్మరణం చెందిన ఘటన భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాకలో సోమవారం జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు బోయిని తిరుపతి రాజు (31) తనకున్న వ్యవసాయ భూమిలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నాడు.
ఆయిల్‌ఫామ్‌లో గడ్డి పెరగడంతో తన ట్రాక్టర్‌తో రోటవేటర్ కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌తో సహా బావిలో పడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు, బావిలో నుంచి తిరుపతి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం పరకాల సివిల్ హాస్పటల్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్టు రేగొండ ఎస్‌ఐ సందీప్ కుమార్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.






