calender_icon.png 12 November, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు ఆత్మహత్య

12-11-2025 12:14:54 PM

మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప సురేందర్ కుమారుడు మృతి తో పెద్దపల్లిలో విషాదం

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లిలో బుధవారం ఉదయం విషాదం నెలకొంది. తల్లిదండ్రులు మందలించాలని మనస్థాపనతో యువకుడు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఒక కుటుంబంలో విషాదం నింపింది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్(Peddapalli Agricultural Market Committee Chairperson) ఈర్ల స్వరూప- సురేందర్ కుమారుడు విశ్వతేజ (17) తన తల్లిదండ్రులు తనను మందలించారని తీవ్ర మనస్థాపాన్ని గురైన విశ్వతేజ రాత్రి పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బంధం పల్లి శివారులోని వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని వ్యవసాయ బావిలో ఉన్న విశ్వతేజను బయటకు తీసి పోస్టుమార్టం పంపించారు. విశ్వతేజ మృతితో తల్లిదండ్రులు మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప సురేందర్ రోదనలు మిన్నంటాయి.  ప్రజాప్రతినిధులు,  బంధువులు ఘటన స్థలానికి చేరుకున్నారు.