12-11-2025 12:16:44 PM
ఉద్యమకారుల వేదిక చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ
హనుమకొండ,(విజయక్రాంతి): పీడిత ప్రజల విముక్తి, మానవీయ విలువల సమాజ నిర్మాణం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం రచనలు, పాటలు రచించి పాడిన మహా కవి అందె శ్రీ(Andesri) ఆశయాలను కొనసాగించాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. వివిధ ప్రజా సంఘాల ఆద్వర్యంలో మంగళవారం హనుమకొండ అంబేద్కర్ సెంటర్ లో జరిగిన ప్రజా కవి అందెశ్రీ నివాళి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పాటల ద్వారా కీలకపాత్ర పోషించిన పాఠశాలకు వెళ్లని అందెశ్రీ కి కాకతీయ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించిందని,అలాంటి మహా కవి అందెశ్రీ బాటలో అందరూ పయనించాలని అన్నారు. కార్యక్రమంలో ఆలిండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, బీసీ మహాసేన రాష్ట్ర కన్వీనర్ తాడిశెట్టి క్రాంతికుమార్, టీజేజెఎస్ జిల్లాఅధ్యక్షుడు చిల్ల రాజేంద్రప్రసాద్, రాజ్ మహ్మద్, కొంగ వీరాస్వామి, నే దునూరి రాజ మౌళి, చుంచు రాజేందర్, సంఘాని మ ల్లేశ్వర్, నలిగింటి చంద్రమౌళి, జల్లెల కృష్ణ మూర్తి యాదవ్, డేవిడ్, బక్కీ యాదగిరి, మంద వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.