calender_icon.png 26 October, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ విఫ‌లం.. యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

26-10-2025 12:34:14 PM

హైదరాబాద్: వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కావడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని చెన్నరావుపేట మండలం ధర్మ తండాకు చెందిన మహేష్(21) గత కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తను ప్రేమించిన అమ్మాయిని మరోకరికి ఇచ్చి చేయాలని, యువతి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నరని తెలుసుకున్న మహేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.  తాను ప్రేమించిన యువతితో పెళ్లి జరగదని తెలిసి మానసికంగా కుంగిపోయిన యువకుడుపురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విషయం తెలసుకున్న కుటుంబీకులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహేష్ మృతితో ధర్మతండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.