calender_icon.png 26 October, 2025 | 1:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జేఎన్‌టీయూ ఫ్లైఓవర్‌పై కారు బీభత్సం.. నలుగురికి గాయాలు

26-10-2025 11:08:18 AM

హైదరాబాద్: నగరంలోని జేఎన్‌టీయూ ఫ్లైఓవర్ పై కారు బీభత్సం సృష్టించింది. ఆదివారం ఉదయం 7.50 గంటలకు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం... నలుగురు సూడాన్ జాతీయులు కేపీహెచ్బీ నుండి హైటెక్ సిటీకి కారులో వెళ్తున్నారు. రైతుబజార్ దాటి జేఎన్‌టీయూ ఫ్లైఓవర్  అతి వేగంతో ఎక్కిన కారు డ్రైవర్ కారు నియంత్రణ కోల్పోయి బైక్‌ను ఢీకొట్టి, ఆపై రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు ముగ్గురు సూడాన్ జాతీయులు సహా నలుగురు వ్యక్తులు గాయపడ్డారు.

గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే యువతులు కారు దిగి మరో క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణ తెలింది. ప్రమాదానికి గురైన కారును అద్దెకు తీసుకున్నారా..? లేదా ఎవరైన ఇచ్చారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుడాన్ కు చెందిన నలుగురు యువకులు నగరంలో చదువుకుంటూ శంషాబాద్ లో ఉంటున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నా పోలీసులు పేర్కొన్నారు.