calender_icon.png 26 October, 2025 | 3:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసుల కార్డెన్ సెర్చ్.. 55 బైకులు సీజ్

26-10-2025 01:30:34 PM

కాగజ్ నగర్,(విజయక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణకే జకార్డెన్‌సర్చ్‌ నిర్వహిస్తున్నామని కాగజ్‌నగర్‌ డీఎస్పీ వహీదుద్దిన్ అన్నారు. కాగజ్‌నగర్‌ టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం సంజీవయ్య కాలనీలో  ఎస్ఐ లక్ష్మణ్, ఈస్గాం ఎస్ఐ కళ్యాణ్, 30 మంది పోలీసు సిబ్బందితో కలిసి కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. డీఎస్పి మాట్లాడుతూ... సైబర్‌ మోసాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్ధాల నివారణ అందరి బాధ్యత అన్నారు. యువత గంజాయి, మత్తు పదార్ధాలకు దూరంగా ఉంటూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. ద్విచక్ర వాహనదా రులు హెల్మెట్‌ ధరించాలని సూచించారు. గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్‌ 100కు సమాచారం అం దించాలన్నారు. కొత్త వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 55 బైక్‌లు సీజ్‌ చేశారు.