26-10-2025 01:18:05 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని శివాలయంలో నేడు ఉదయం 11 గంటలకు (ఆదివారం) తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరుపేద గంటలకు సామూహిక వివాహాలు జరిపేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 22 నిరుపేద జంటలకు వివాహాలు జరిపించి వారికి ఉచిత భోజన వసతి కల్పిస్తున్నారు. వివాహ జంటలకు పుస్తెలు, మట్టెలు, నూతన వస్త్రాలు, వంట సామాగ్రి, బిందె, ట్రావెల్ బ్యాగ్, గోడ గడియారం, వంట కుక్కర్ లను వాకర్స్ సభ్యులు ఉచితంగా అందజేస్తున్నారు. తిలక్ వాకర్స్ అధ్యక్షులు రత్నం రాజన్న, ప్రధాన కార్యదర్శి కంటే వాడ నగేష్, ఉపాధ్యక్షులు రంగ రామన్న, సభ్యులు గెల్లి జయరాం యాదవ్, ముత్య వెంకట రాజం, గరిగ రాజ్ కుమార్, గరిగి వేణుగోపాల్ ల తో పాటు సభ్యులు వివాహ వేడుకలను ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.