26-10-2025 01:33:39 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని దేవి శ్రీ ఫంక్షన్ హాల్ లో జరిగిన సిఐటియు వలిగొండ 11వ మండల మహాసభ లో మండల కన్వీనర్ గా తుర్కపల్లి సురేందర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చిన కార్మికులకు అందుబాటులో ఉండి కార్మికుల సమస్యల పరిష్కరించడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు.
అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో లేనప్పుడు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని వేదికల ద్వారా సభల ద్వారా అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకిరాగానే వాగ్దానాలు గాలికి వదిలేస్తున్నాయని అని విమర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు కార్మికుల పక్షాన సిఐటియుగా పోరాటాలు నిర్వహిస్తాన ని హామీ ఇచ్చారు. మండల కన్వీనర్ గా ఎన్నుకున్నందుకు వివిధ రంగాల కార్మికులకు ధన్యవాదాలు తెలియజేశారు.