calender_icon.png 26 October, 2025 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో ప్రారంభమైన మెగా జాబ్ మేళా

26-10-2025 01:27:10 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి ఏఎంసి నెంబర్ 2 గ్రౌండ్లో ఆదివారం సింగరేణి సంస్థ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతో చేపట్టిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని  ఎమ్మెల్యే గడ్డం వినోద్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మందమరి ఏరియా, బెల్లంపల్లి నియోజక వర్గం నుంచి 8 వేల మందిపైగా నిరుద్యోగులు హాజరై దరఖాస్తులు సమర్పించారు. ఈ కార్యక్రమానికి  జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సబ్ కలెక్టర్ మనోజ్, సింగరేణి ప్లానింగ్ అండ్ డైరెక్టర్ (పిపి) కె వెంకటేశ్వర్లు, మందమరి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ, ఎస్ ఓ టు జిఎం విజయ్ ప్రసాద్, పలువురు అధికారులు, నిరుద్యోగ అభ్యర్థులు పాల్గొన్నారు.