4 March, 2026 | 3:25 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

04-03-2026 12:00 AM

ఇద్దరికి తీవ్ర గాయాలు

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా, మార్చి 3 (విజయక్రాంతి): జిల్లాలోని రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.ఎస్త్స్ర వెంకటకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, కిష్టాపూర్ గ్రామంలో పత్తి చేను పనుల కోసం ఇటీవల మహారాష్ట్రకు చెందిన కొంతమంది కూలీలు వలసగా వచ్చారు. ఆ కూలీలలో లక్ష్మి అనే యువతితో రాందాస్ విఠల్ పవర్ (22)కు ఇటీవల వివాహం నిశ్చయమైంది.

హోలీ పండుగ సందర్భంగా రాందాస్ తన స్నేహితులు తుకారం, సూరజ్ విఠల్ జాదవ్తో కలిసి కిష్టాపూర్కు వచ్చాడు.లక్ష్మిని కలిసి పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై నారాయణపూర్ వైపు వెళుతుండగా,  అతివేగంగా వస్తున్న ఇన్నోవా కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాందాస్ అక్కడికక్కడే మృతి చెందాగా,తుకారం, సూరజ్ లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుడి అన్న సిరజ్ విఠల్ పవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.