4 March, 2026 | 4:53 PM

అంబరాన్నంటిన హోలీ సంబురాలు

04-03-2026 12:00 AM

మహబూబాబాద్/వరంగల్/ములుగు/హనుమకొండ/జనగామ/జయశంకర్ భూపాలపల్లి, మార్చి 3 ( విజయక్రాంతి ) : రంగుల పండుగ హోలీ వేడుకలను మంగళవారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆ నందోత్సవాల నడుమ జరుపుకున్నారు. చి న్నా పెద్దా అనే తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోళీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కేరింతలు కొట్టారు.

యువతి, యువకులు జట్లుగా ఏర్పడి రంగులు చల్లుకుంటూ హోళీ పండుగ సందడి చేశారు. వివిధ జిల్లా కేంద్రాల్లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తరతతమ భేదాలు మరిచి హోళీ వేడుకల్లో పాల్గొన్నారు. ఆటపాటలతో నృత్యాలు చేస్తూ హోలీ పండుగను జాలీగా ఎంజాయ్ చేశారు.