16-01-2026 02:31:32 PM
క్రీడలతో క్రమశిక్షణ పెరుగుతుంది....
సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్....
సుల్తానాబాద్,(విజయక్రాంతి): యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రీడలతో క్రమశిక్షణ పెరుగుతుందని సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ అన్నారు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కీర్తిశేషులు బండ నీలమ్మ కొమురయ్య లా జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు బండ రవీందర్ పుష్పలత దంపతులు ఏర్పాటు చేసిన గట్టపల్లి గ్రామస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఎస్సై చంద్రకుమార్ ప్రారంభించారు, ఈ టోర్నమెంట్ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్సై విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది, అనంతరం జరిగిన సమావేశం లో చంద్రకుమార్ మాట్లాడుతూ క్రీడలతో నాయకత్వ లక్షణాలు పెరుగుతాయన్నారు.
గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి, ఓడిపోయిన వారు మరోసారి గెలిచేందుకు ప్రయత్నించాలన్నారు, శారీరక శ్రమతో క్రీడాకారులు, యువకులు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు, ఇంత మంచి టోర్నమెంట్ ను నిర్వహించిన సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ హోంగార్డు బండ రవీందర్ కు ఎస్సై చంద్రకుమార్ శాలువా కప్పి సన్మానం చేసి అభినందించారు, ఈ కార్యక్రమం లో సర్పంచ్ గుండేటి దేవేందర్, ఉప సర్పంచ్ గుర్రం రేణుక శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నల్లవెల్లి రాజమౌళి, నేషనల్ వాలీబాల్ క్రీడాకారులు బండ శ్రావణ్ కుమార్ , బండారి లక్ష్మణ్ , కొల్లూరి రాజశేఖర్, ఈర్ల సంతోష్ , ఎండి అజీమ్ , రమాకాంత్ తో పాటు పెద్ద ఎత్తున క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు... ఈ టోర్నమెంట్ కు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్సై చంద్ర కుమార్ ను బండ రవీందర్ తో పాటు క్రీడాకారులు ఘనంగా సన్మానించారు...