16-01-2026 02:57:19 PM
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల స్థానిక పోలీస్ స్టేషన్ లో శుక్రవారం విజయక్రాంతి న్యూస్ పేపర్ క్యాలెండర్ ను ఎస్ఐ మహేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ...విజయక్రాంతి దినపత్రిక సమాజంలో ఒక శక్తివంతమైన సమాచార మాధ్యమంగా పనిచేస్తుందని, ప్రజల సమస్యలను, ప్రభుత్వానికి చేరవేయడంలో పత్రిక కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ప్రభుత్వం తీసుకునే విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకువస్తూ, పరిష్కార దిశగా ముందడుగు వేస్తున్నా పత్రిక "విజయక్రాంతి" దినపత్రిక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఇనోక్, స్టేషన్ రైటర్ గణపతి, సిబ్బంది ప్రశాంత్, ఫరహన్, రాధిక పాల్గొన్నారు.