calender_icon.png 16 January, 2026 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం భక్తజన సందోహం

16-01-2026 03:11:19 PM

జాతరకు ముందే తరలివచ్చిన భక్తులు 

గట్టమ్మ గుడి నుండి మేడారం వరకు అడుగడుగున ట్రాఫిక్ జామ్ 

మేడారం(విజయక్రాంతి): సంక్రాంతి సెలవుల కారణంగా మేడారం జాతరకు(Medaram Jatara) ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు పోటెత్తారు. వరస సెలవులు రావడంతో శుక్రవారం రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు మేడారం బాట పట్టారు. గట్టమ్మ దేవాలయం నుండి మేడారం వరకు అనేక చోట్ల ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఒక్కసారిగా లక్షల్లో భక్తులు మేడారం రావడంతో సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో నిండిపోయింది.

పోలీసులు జాతరకు ముందుగానే గద్దెల ప్రాంగణానికి క్యూలైన్ల ద్వారా భక్తులను పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు ఇంత పెద్ద సంఖ్యలో ముందస్తుగా భక్తులు వస్తారని అంచనా వేయలేకపోయారు. మేడారంలో స్నాన ఘట్టాల వద్ద భక్తులు స్నానం చేయడానికి ఇబ్బందులు పడ్డారు. వాహనాలను అనేకచోట్ల పార్కింగ్ చేయించడంతో అక్కడి నుండి గద్దెల ప్రాంగణానికి, జంపన్న వాగు కు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు.