calender_icon.png 16 January, 2026 | 5:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూడో క్రీడాకారుడికి అండగా వేముల విపుల్

16-01-2026 02:59:34 PM

చిట్యాల,(విజయక్రాంతి): జూడో క్రీడాకారుడికి అండగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తనయుడు వేముల విపుల్ శుక్రవారం ఆర్థిక చేయూతను అందించారు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన మహేశ్వర ప్రవీణ్ కుమార్ గత ఐదు సంవత్సరాల నుండి జూడో క్రీడను అభ్యసిస్తున్నారు. మూడుసార్లు జాతీయస్థాయిలో పాల్గొని తెలంగాణ నుండి రజత పతకాలు, ఒక కాంస్య పతకం సాధించారు.

గత నెలలో జరిగిన అండర్ 17 రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో 45 కేజీల విభాగంలో బంగారు పతకం గెలుచుకొని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక అయ్యారు. జాతీయ స్థాయి పోటీలు ఈనెల 22 నుంచి 26 వరకు మణిపూర్ రాష్ట్రంలోని ఇంపాల్ లో జరుగుతుండగా, ప్రవీణ్ కి తల్లిదండ్రులు కూడా ఎవరూ లేరని క్రీడల్లో రానిస్తున్న విషయాన్ని తెలుసుకొని   క్రీడాకారుడు   ప్రవీణ్ కుమార్ మణిపూర్ వెళ్ళుటక ఆర్థిక సహాయం అందజేసి నీకు ఏ అవసరం ఉన్న నేనున్నా అని భరోసా ఇచ్చి తెలంగాణ రాష్ట్రానికి నల్గొండ జిల్లా కి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థిని  వేముల విపుల్  ప్రోత్సహించారు.