calender_icon.png 16 January, 2026 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె దవాఖానతో పల్లె ప్రజలకు ఎంతో మేలు

16-01-2026 03:05:11 PM

సూరయ్యపల్లి లో పల్లె దవాఖాన ప్రారంభోత్సవంలో సర్పంచ్ ఆర్ల నాగరాజు

మంథని,(విజయక్రాంతి): పల్లె దవాఖాన తో పల్లె ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని సూరయ్యపల్లి సర్పంచ్ ఆర్ల నాగరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని సూరయ్యపల్లి గ్రామం లో పల్లె దవాఖాన  ను గ్రామ ఉప సర్పంచ్ అరెల్లి సుచిత-వరుణ్ తో కలిసి  సర్పంచ్ ఆర్ల నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పల్లె దవాఖాన ఏర్పాటుకు సహకరించిన మంత్రి శ్రీధర్ బాబు, పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు కు సర్పంచ్, ఉపసర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ కార్యక్రమం వార్డు సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శి జైపాల్, ఎంఎల్ హెచ్ పీ శ్రావణి, ఏఎన్ ఎం శ్వేత, ఆశ వర్కర్లు, మాజీ సర్పంచ్ ఆకుల కిరణ్, పెద్దపల్లి సోషల్ మీడియా ఇంచార్జ్ ఆరెల్లి కిరణ్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు రేపాక శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జంజర్ల మల్లేష్, కాంగ్రెస్ నాయకులు ఆర్ల లింగయ్య, ఆర్ల జ్ఞాని, జంజర్ల గట్టయ్య, జంజర్ల రాజు,  తాటి సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ నాయకులు చంద్రు, విజయ, ఎరుకల సురేష్, రావుల నాగేష్, సుదర్శన్, శివ కిషోర్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.