calender_icon.png 16 January, 2026 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సంఘాలతో పారిశుధ్యంపై అవగాహన సమావేశం

16-01-2026 03:02:08 PM

చింతలఠాణ గ్రామంలో మహిళా సంఘాలతో పారిశుధ్యంపై అవగాహన సమావేశం

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా చింతలఠాణ గ్రామంలో సర్పంచ్ గుర్రం అనసూర్య మహేందర్ ఆధ్వర్యంలో మహిళా సంఘం సభ్యులతో గ్రామ సమస్యలు, పారిశుధ్య అంశాలపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉత్పత్తి అవుతున్న తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌కు అందజేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. పరిశుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి కుటుంబం చెత్త వేర్పాటులో సహకరించాలని సర్పంచ్ కోరారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ బోయిని తిరుపతి, వార్డు సభ్యులు పాల్గొనగా, గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.