25 July, 2026 | 6:26 PM

Breaking News

వారం రోజుల్లోగా భగత్ నగర్ దొంగలను పట్టుకోవాలి   •   ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత   •   టైరు పంచర్‌తో ఆటో బోల్తా.. మహిళకు తీవ్ర గాయాలు   •   పెండింగ్ కేసుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు   •   టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •  

డ్యాన్స్ మాస్టర్ వేధింపులు!

01-03-2025 11:23 PM

సెల్ఫీ వీడియో తీసుకుని యువతి ఆత్మహత్య 

ఖమ్మం,(విజయక్రాంతి): ఓ డ్యాన్స్ మాస్టర్ వేధింపులు తాళలేక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్‌లో శనివారం జరిగింది. ఖమ్మం వీడియోస్ కాలనీకి చెందిన కావ్య కళ్యాణి.. ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే డ్యాన్స్ షోలో పొల్గొన్నది. ఆ సమయంలో అదే షోలో డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసే ఖమ్మంకు చెందిన అభిలాష్ అనే యువకుడిని ప్రేమించి, పెళ్ళి చేసుకుంది. గత ఐదేళ్లు ఇద్దరూ కలిసి ఖమ్మంలోని మామిళ్లగూడెంలో నివాసం ఉన్నారు. ఇటీవలే నివాసాన్ని పొన్నేకల్‌కు మార్చారు. ఈ క్రమంలోనే శనివారం కావ్య కళ్యాణి సెల్ఫీ వీడియో తీసుకుని, తన చావుకు అభిలాషే కారణమని చెప్పి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఆస్తి మీద వ్యామోహంతో అభిలాష్ మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడటంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఖమ్మం రూరల్ పోలీసులు అభిలాష్‌ను అదుపులోకి తీసుకున్నారు.