యువజన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం
హాజరైన, కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి
ఎల్లారెడ్డి, డిసెంబర్ 29 (విజయ క్రాంతి): యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, జోనల్ ఇంచార్జ్ థామస్ మరియు రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిలు, జిల్లా ఇంచార్జ్ వినూత్న రెడ్డి హాజరయ్యారు.
అనంతరం యువజన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ,స్థానిక సంస్థ ఎన్నికల్లో జిల్లా యువజన కాంగ్రెస్ నుండి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ లు గా గెలుపొందిన వారిని అభినందించడం జరిగిందనీ ఈ సందర్భంగ, ఆయన అన్నారు.
దేశంలో బిజెపి మరియు ఈ.సి కలిసి చేస్తున్న ఓటు చోరీ అంశాన్ని వివరిస్తూ, విత్ ఐవైసీ యాప్ మరియు స్థానిక సంస్థ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ పాత్ర, ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడం పలు అంశాలపై యువజన కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సర్దార్ నాయక్, శ్రీనివాస్, సయ్యద్ మన్సూర్, ఇమ్రోజ్, ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని ఎనిమిది మండలాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






