30-12-2025 12:34:26 AM
నిజామాబాద్, డిసెంబర్ 29 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని చైనా మాంజ వాడకం వలన ప్రజలకు జంతువులకు పక్షులకు ప్రమాదం వాటిల్ల వాటిలో ఉన్నందున రామాంజను దించడం అయినదని. చైనా మాంజా వలన ఎవరైనా వ్యక్తులకు ప్రాణహాని కలిగితే వారిపై హత్య నేరము క్రింద కేసు నమోదు చేస్తామని నిజామాబాద్ సిపి సాయి చైతన్య హెచ్చరించారు.
ఎవరైనా చైనా మాంజా నిలువ ఉంచిన, ఎవరైనా చైనా మాంజ తయారు చేసిన, ఎవరైనా చైనా మాంజా అమ్మిన లేదా అమ్మడానికి ఎవరైనా ప్రోత్సహించిన వారిపై చట్ట ప్రకారము చర్యలు తీసుకొనబడును. కావున కొంతమంది ఇప్పటికే హైదరాబాదు నుండి నిజామాబాదుకు చైనా మాంజా తరలించినట్లు పోలీసులకు సమాచారం ఉన్నది. అట్టి చైనా మాంజా సంబంధిత పోలీస్ స్టేషన్ యందు అప్పగించగలరు లేదా కాల్చి వేయగలరు. ఎవరైనా బయటపడేసినట్లయితే ప్రజలకు జంతువులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉన్నది . ఎవరైనా ఇట్టి చైనా మాంజా విక్రయించిన , అట్టి మాంజాతో ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే విక్రయ దారులు కూడా అట్టి కేసుకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
కాబట్టి పైన తెలియ చేసిన సూచనలకు విరుద్ధంగా ఎవరైనా చైనా మాంజా నిలువ చేసిన, అమ్మిన వారిపై చట్ట ప్రకారము చర్యల కుంటమని సిపి హెచ్చరించారు. ఎవరి వద్దనై న చైనా మాంజా ఉన్నట్లయితే వారు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ యందు అప్పగించ అప్పగించాలని సిపి సూచించారు. చైనా మాంజా ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు సమాచారం తెలిసినట్లయితే తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో తెలియజేయలని, లేదా డయల్ 100కు డయల్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని సిపి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చినటువంటి వారి వివరాలు గోప్యముగా ఉంచుతామని తెలిపారు.